close
మెరిసిన సాయిప్రసాద్‌, దీప్షిక

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి షట్లర్లు సాయి ప్రసాద్‌, దీప్షిక మెరిశారు. అండర్‌-13 బాలుర విభాగంలో ప్రసాద్‌ ఛాంపియన్‌గా నిలవగా... బాలికల సింగిల్స్‌లో దీప్షిక రన్నరప్‌ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఆదివారం చేతన్‌ ఆనంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో జరిగిన ఫైనల్లో టాప్‌సీడ్‌ ప్రసాద్‌ 21-10, 21-16 తేడాతో జ్ఞాన దత్తు (రంగారెడ్డి)పై విజయం సాధించాడు. టోర్నీ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం సాగిస్తూ వచ్చిన ప్రసాద్‌ టైటిల్‌ పోరులోనూ అంచనాల మేర రాణించి ప్రత్యర్థిని వరుస గేమ్‌ల్లో చిత్తుచేశాడు. బాలికల తుదిపోరులో టాప్‌సీడ్‌ దీప్షిక 18-21, 21-10, 15-21తో రెండో సీడ్‌ ప్రశన్స (ఖమ్మం) చేతిలో ఓడింది. తొలి గేమ్‌లో ఓడిన దీప్షిక.. రెండో గేమ్‌లో విజయంతో పుంజుకుంది. కానీ నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రత్యర్థి ముందు తలవంచింది. బాలుర డబుల్స్‌లో వర్షిత్‌ శ్రీసాయి (ఖమ్మం)- రోహన్‌ కుమార్‌ (రంగారెడ్డి) జోడీ 21-11, 21-10తో అభినవ్‌ (హైదరాబాద్‌)- శౌర్య కిరణ్‌ (వరంగల్‌)పై గెలిచి టైటిల్‌ దక్కించుకుంది. బాలికల డబుల్స్‌ ఫైనల్లో షాగున్‌ సింగ్‌- శ్రిష్ఠి సింగ్‌ జంట (రంగారెడ్డి) 18-21, 21-19, 21-11తో వెన్నెల (హైదరాబాద్‌)- ప్రశన్సపై నెగ్గింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.