close
ఛాంప్స్‌ భవన్స్‌, జీఆర్‌ఎఫ్‌ఏ

ఛాంపియన్స్‌ కప్‌ ఫుట్‌బాల్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఫ్రెండ్స్‌క్లబ్‌ బొల్లారం ఆధ్వర్యంలో నిర్వహించిన ఛాంపియన్స్‌ కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ అండర్‌-18 విభాగంలో భవన్స్‌, అండర్‌-16లో జీఆర్‌ఎఫ్‌ఏ విజేతలుగా నిలిచాయి. ఆదివారం జరిగిన ఫైనల్లో భవన్స్‌ 1-0 తేడాతో స్కైకింగ్స్‌ అకాడమీ (బోయిన్‌పల్లి)పై విజయం సాధించింది. భార్గవ్‌ గెలుపు గోల్‌ కొట్టాడు. అండర్‌-16 బాలుర ఫైనల్లో జీఆర్‌ఎఫ్‌ఏ 2-1 (పెనాల్టీ షూటౌట్లో)తో రీడ్స్‌ ఎఫ్‌సీపై గెలిచింది. బాలికల తుదిపోరులో హైదరాబాద్‌ ఆల్‌ యునైటెడ్‌ ఎఫ్‌సీ 4-1తో బాలికల యునైటెడ్‌పై నెగ్గింది. సిమ్రాన్‌, ఓలివ్స్‌ చెరో రెండు గోల్స్‌ కొట్టారు. అండర్‌-14 విభాగంలో యునైటెడ్‌ ఎఫ్‌సీ, అండర్‌-10లో జీఆర్‌ఎఫ్‌ఏ టైటిళ్లు దక్కించుకున్నాయి.

గన్‌రాక్‌కు ట్రోఫీ: సర్వింగ్‌ త్రూ స్పోర్ట్స్‌ (ఎస్‌టీఎస్‌) ఒక్కరోజు ఫుట్‌బాల్‌ టోర్నీలో గన్‌రాక్‌ ఎఫ్‌సీ విజేతగా నిలిచింది. ఆదివారం కుత్బుల్లాపూర్‌లోని సెయింట్‌ మోసెస్‌ పాఠశాల మైదానంలో జరిగిన ఫైనల్లో గన్‌రాక్‌ ఎఫ్‌సీ 3-2 (టైబ్రేకర్‌) తేడాతో శాస్త్రి ఎఫ్‌సీపై గెలిచింది. తెలంగాణ ఫుట్‌బాల్‌ సంఘం కార్యదర్శి ఫాల్గుణ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.