close
రాణించిన మనీశ్‌, రిత్విక్‌

విజయ్‌ సీసీ గెలుపు
ఎ- డివిజన్‌ వన్డే లీగ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: మనీశ్‌ (4/19) హ్యాట్రిక్‌తో సహా నాలుగు వికెట్లతో విజృంభించడంతో ఆదివారం జరిగిన ఎ3- డివిజన్‌ వన్డే లీగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో విజయ్‌ సీసీ ఐదు వికెట్ల తేడాతో సఫిల్‌గూడ సీసీపై గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన సఫిల్‌గూడ సీసీ.. మనీశ్‌ ధాటికి 39.4 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ఖుష్‌ (34), రామకృష్ణ (34) రాణించారు. బౌలింగ్‌లో మనీశ్‌తో పాటు గౌతమ్‌ (2/25) కూడా ఆకట్టుకున్నాడు. బదులుగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన విజయ్‌ సీసీ 5 వికెట్లు కోల్పోయి 31 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. రిత్విక్‌ (43 నాటౌట్‌) అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. ప్రత్యర్థి బౌలర్లలో కార్తీక్‌ (2/15) రెండు వికెట్లు పడగొట్టాడు.

ఎ3- డివిజన్‌ వన్డే లీగ్‌:
సఫిల్‌గూడ సీసీ: 111 (ఖుష్‌ 34, రామకృష్ణ 34, మనీశ్‌ 4/19, గౌతమ్‌ 2/25),
విజయ్‌ సీసీ: 112/5 (రిత్విక్‌ 43 నాటౌట్‌, కార్తీక్‌ 2/15)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.