close
కృష్ణప్రియకు కాంస్యం

ఈజిప్ట్‌ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

కైరో: ఈజిప్ట్‌ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో హైదరాబాద్‌ షట్లర్‌ శ్రీ కృష్ణప్రియ మెరిసింది. మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఐదో సీడ్‌గా బరిలో దిగిన ప్రియ సెమీస్‌లో 16-21, 11-21తో రెండో సీడ్‌ జోర్డాన్‌ హార్ట్‌ (వేల్స్‌) చేతిలో పరాజయం చెందింది. అంతకుముందు క్వార్టర్స్‌లో ఆమె 21-10, 21-19తో మూడో సీడ్‌ డోరియస్‌ (నైజీరియా)పై గెలిచింది. ఆ మ్యాచ్‌ తర్వాత రెండు గంటల్లోపే తిరిగి సెమీస్‌ ఆడాల్సి రావడంతో అలసిపోయిన ప్రియ.. స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించలేకపోయింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.