close
రాణించిన పృథ్వీ, వ్యోమకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణ బోణీ
సీఐఎస్‌సీఈ జాతీయ క్రికెట్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: సీఐఎస్‌సీఈ జాతీయ అండర్‌-17 బాలుర క్రికెట్‌ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణ జట్టు బోణీ కొట్టింది. బ్యాటింగ్‌లో పృథ్వీరెడ్డి (98; 46 బంతుల్లో 9×4, 7×6), బౌలింగ్‌లో వ్యోమకేశ్‌ (3/18) రాణించడంతో సోమవారం పీర్జాదిగూడలోని బాబురావు సాగర్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 51 పరుగుల తేడాతో ఒడిషాపై గెలిచింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణ జట్టు 15 ఓవర్లలో 2 వికెట్లకు 149 పరుగులు చేసింది. పృథ్వీ ధనాధన్‌ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతనితో పాటు సాత్విక్‌ రెడ్డి (34) కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. బదులుగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఒడిషా 15 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 98 పరుగులే చేయగలిగింది. ఆ జట్టులో చిరాగ్‌ మిశ్రా (64) అర్ధశతకంతో పోరాడినా ఫలితం లేకపోయింది. వ్యోమకేశ్‌ బౌలింగ్‌లో చెలరేగి ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అంతకుముందు మాజీ ఫస్ట్‌క్లాస్‌ ఆటగాడు వంకా ప్రతాప్‌ ముఖ్య అతిథిగా హాజరై టోర్నీని ఆరంభించాడు. నాలుగు రోజుల పాటు సాగే ఈ ఛాంపియన్‌షిప్‌లో మొత్తం 10 ప్రాంతీయ జట్లు పోటీపడుతున్నాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.