close
విజయ్‌ హజారె సెమీస్‌లో తమిళనాడు, చత్తీస్‌గఢ్‌

బెంగళూరు: విజయ్‌ హజారె ట్రోఫీలో తమిళనాడు, చత్తీస్‌గఢ్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. ముంబయి, పంజాబ్‌లతో క్వార్టర్‌ఫైనల్స్‌కు వర్షం అడ్డంకి కలిగించడంతో లీగ్‌ దశలో ఎక్కువ విజయాలు సాధించిన తమిళనాడు, చత్తీస్‌గఢ్‌ ముందంజ వేశాయి. సోమవారం ముంబయితో మ్యాచ్‌లో మొదట చత్తీస్‌గఢ్‌ 45.4 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది. హర్‌ప్రీత్‌సింగ్‌ (83), అమన్‌దీప్‌ (59 నాటౌట్‌) రాణించారు. ఛేదనలో ముంబయి 11.3 ఓవర్లలో 95/0తో నిలిచింది. ఈ స్థితిలో వర్షం మ్యాచ్‌ను అడ్డుకుని ముంబయికి నిరాశను మిగిల్చింది. పంజాబ్‌తో క్వార్టర్స్‌లో మొదట తమిళనాడు 39 ఓవర్లలో 174/6 స్కోరు చేసింది. అపరాజిత్‌ (56), సుందర్‌ (35 నాటౌట్‌) రాణించారు. వర్షం కారణంగా ఆట ఆపే సమయానికి పంజాబ్‌ 12.2 ఓవర్లలో 2 వికెట్లకు 52 పరుగులే చేసింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.