close
చెస్‌ విజేత మైత్రి

స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌ ఛాంపియన్‌షిప్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌ ఛాంపియన్‌షిప్‌ చెస్‌ పోటీల్లో మైత్రి (ది ఫ్యూచర్‌ కిడ్స్‌) మెరిసింది. మంగళవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన అండర్‌-13 బాలికల విభాగంలో ఆమె పసిడి గెలుచుకుంది. ఐశ్వర్య (ది ఫ్యూచర్‌ కిడ్స్‌), శ్రీవ్యూహ (సెంటియా స్కూల్‌) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. అండర్‌-12 బాలికల టేబుల్‌ టెన్నిస్‌లో శ్రేష్ఠ రెడ్డి (ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌) ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో ఆమె 11-7, 11-2 తేడాతో సరయు (మెరిడియన్‌)పై గెలిచింది. ఫుట్‌బాల్‌ అండర్‌-12 బాలుర ఫైనల్లో ఫీనిక్స్‌ గ్రీన్స్‌ ఇంటర్నేషనల్‌ 2-0తో ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌పై నెగ్గి ట్రోఫీ సొంతం చేసుకుంది. బాలికల తుదిపోరులో మెరు ఇంటర్నేషనల్‌ 1-0తో ది ఫ్యూచర్‌ కిడ్స్‌పై జయకేతనం ఎగురవేసింది. వాలీబాల్‌ అండర్‌-19 బాలుర విభాగంలో కెన్నడీ మ్యాగ్నెట్‌ 25-15, 25-23తో గ్లెండేల్‌ అకాడమీపై గెలిచి టైటిల్‌ కైవసం చేసుకుంది.

మిగతా విజేతలు: అథ్లెటిక్స్‌.. 100మీ.పరుగు.. అండర్‌-18 బాలురు: 1.మనో వెంకట్‌(11.86సెకన్లు- గీతాంజలి), 2.నిశ్చల్‌ (12.07సె- డీఆర్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌), 3.ఆనంద్‌ శంకర్‌ (12.26సె- పల్లవి మోడల్‌); బాలికలు: 1.సుహా (15.01సె- ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌), 2.శివాస్మిత (15.05సె- ఆర్మీ పబ్లిక్‌), 3.శ్రీవిద్య (15.45సె- ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌); అండర్‌-16.. బాలుర హైజంప్‌: 1.శౌరిష్‌ (1.63మీటర్లు- దిల్లీ పబ్లిక్‌), 2.ప్రవీణ్‌ (1.60మీ- ప్రభుత్వ ప్రైమరీ), 3.నాగరాజ్‌ (1.60మీ- సీఆర్‌పీఎఫ్‌ పబ్లిక్‌); బాలికల లాంగ్‌జంప్‌: 1.అక్షయ (4.14మీ- సన్‌ఫ్లవర్‌ వేదిక్‌), 2.చేతన (4.11మీ- ఆర్మీ పబ్లిక్‌), 3.చాందిని (3.85మీ- జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌); షూటింగ్‌: అండర్‌-19.. బాలుర ఎయిర్‌ రైఫిల్‌: 1.తిరుమల జయంత్‌ (ఓపెన్‌ మైండ్స్‌), 2.జహి (ఇండస్‌ ఇంటర్నేషనల్‌), 3.రోహన్‌ (దిల్లీ పబ్లిక్‌); ఎయిర్‌ పిస్టోల్‌: 1.వెంకట విశ్వజయంత్‌ (సాంటా మారియా ఇంటర్నేషనల్‌), 2.అన్విత్‌ (ది ఫ్యూచర్‌ కిడ్స్‌), 3.ధనుశ్‌ (ది హైదరాబాద్‌ పబ్లిక్‌); బాలికల ఎయిర్‌ పిస్టోల్‌: 1.ఐషిత (ది ఫ్యూచర్‌ కిడ్స్‌), 2.సహస్ర (ఆర్మీ పబ్లిక్‌), 3.ఆర్ణ జోషి (సెంటియా)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.