close
విజృంభించిన ప్రతీక్‌

శ్రీచక్ర విజయం
 ఎ- డివిజన్‌ రెండు రోజుల లీగ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎ- డివిజన్‌ రెండు రోజుల లీగ్‌ క్రికెట్‌ టోర్నీలో శ్రీచక్ర జట్టు ఆఫ్‌స్పిన్నర్‌ ప్రతీక్‌ (7/36) విజృంభించాడు. అతను ఏడు వికెట్లతో చెలరేగడంతో మంగళవారం ముగిసిన మ్యాచ్‌లో ఆ జట్టు 186 పరుగుల తేడాతో పాషా బీడీపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీచక్ర 68.4 ఓవర్లలో 314 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో శంకర్‌ యాదవ్‌ (73) అర్ధసెంచరీతో మెరవగా... అరుణ్‌ కుమార్‌ (42), సాయి సంపత్‌ (47) చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. ప్రత్యర్థి బౌలర్లలో స్వచిత్‌ కుమార్‌ (3/59), ఫయీమ్‌ (2/60) ఆకట్టుకున్నారు. అనంతరం ఛేదనలో పాషా బీడీ 39 ఓవర్లలో 128 పరుగులకే కుప్పకూలింది. ప్రతీక్‌ స్పిన్‌ ఉచ్చులో పడిన ఆ జట్టు విలవిలలాడింది. అతని బంతులను ఎదుర్కోలేక ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ పెవిలియన్‌కు వరుస కట్టారు. టౌకీర్‌ (32) ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించాడు.

మెరిసిన జాక్‌, మజీద్‌: బౌలింగ్‌లో మహమ్మద్‌ జాక్‌ (5/68), బ్యాటింగ్‌లో ఎస్కే మజీద్‌ (105 నాటౌట్‌) చెలరేగడంతో అపెక్స్‌ సీసీతో జరిగిన మ్యాచ్‌లో నల్గొండ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన అపెక్స్‌ సీసీ.. జాక్‌ ధాటికి 41.5 ఓవర్లలో 192 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో వినీత్‌ (49), రామకృష్ణ (48) రాణించారు. బదులుగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన నల్గొండ.. మజీద్‌ శతకం సాయంతో 5 వికెట్లు కోల్పోయి 42.2 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది.

* శ్రీచక్ర: 314 (శంకర్‌ యాదవ్‌ 73, అరుణ్‌ కుమార్‌ 42, సాయి సంపత్‌ 47, స్వచిత్‌ కుమార్‌ 3/59, ఫయూమ్‌ 2/60), పాషా బీడీ: 128 (టౌకీర్‌ 32, ప్రతీక్‌ 7/36); బీ అపెక్స్‌ సీసీ: 192 (వినీత్‌ 49, రామకృష్ణ 48, మహమ్మద్‌ జాక్‌ 5/68), నల్గొండ: 194/5 (మజీద్‌ 105 నాటౌట్‌, బుచ్చిబాబు 47, ప్రమోద్‌ 3/57)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.