close
తిలక్‌ వర్మ శతకం

ఇండియా- బి విజయం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: బీసీసీఐ పురుషుల అండర్‌-19 వన్డే ఛాలెంజర్‌ ట్రోఫీలో హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ ఠాకూర్‌ తిలక్‌ వర్మ (101; 106 బంతుల్లో 10×4, 3×6) శతకంతో మెరిశాడు. అతను సెంచరీతో రాణించడంతో బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో ఇండియా-సితో జరిగిన మ్యాచ్‌లో ఇండియా- బి ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ‘సి’ జట్టు 47.2 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో శాశ్వత్‌ రావత్‌ (129) శతకంతో సత్తాచాటాడు. ప్రత్యర్థి బౌలర్లలో ఆకాశ్‌ (3/38) ఆకట్టుకున్నాడు. అనంతరం ఛేదనలో తిలక్‌ సెంచరీతో పాటు యశ్‌ ధూల్‌ (86) కూడా చెలరేగడంతో ‘బి’ మూడు వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. మరో మ్యాచ్‌లో ఇండియా- ఎ 107 పరుగుల తేడాతో నేపాల్‌ అండర్‌-19పై గెలిచింది. ‘ఎ’ జట్టు తరపున ఆంధ్ర ఆటగాడు నితీశ్‌ కుమార్‌ (30, 2/21) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మెరిశాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.