close
విజృంభించిన సలీమ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: సలీమ్‌ (7/44) ఏడు వికెట్లతో విజృంభించడంతో పీకేఎంసీసీతో బుధవారం ముగిసిన ఎ1- డివిజన్‌ రెండు రోజుల లీగ్‌ మ్యాచ్‌లో స్పోర్టివ్‌ సీసీ 50 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన స్పోర్టివ్‌ సీసీ 70.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో నరైన్‌ (41) పోరాడాడు. ప్రత్యర్థి బౌలర్లలో రుషీల్‌ (4/20) మెరిశాడు. బదులుగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన పీకేఎంసీసీని సలీమ్‌ తన బౌలింగ్‌తో వణికించాడు. పదునైన బంతులతో హడలెత్తించాడు. అతని ధాటికి ఆ జట్టు 113 పరుగులకే కుప్పకూలింది.
ఎ1- డివిజన్‌ రెండు రోజుల లీగ్‌: * స్పోర్టివ్‌ సీసీ: 163 (నరైన్‌ 41, రుషీల్‌ 4/20, శివశంకర్‌ 2/63), పీకేఎంసీసీ: 113 (వెంకట్‌ 28, సలీమ్‌ 7/44, నరైన్‌ 2/33); * బ్రదర్స్‌ ఎలెవన్‌: 408, ఉస్మానియా: 177/8 (అనీశ్‌ రావు 78, నితిన్‌ 4/85, జార్జ్‌ 3/35)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.