
ముంబయి: క్రీడాకారులకు తన అవసరం ఉన్నందునే కోచ్గా కొనసాగుతున్నట్లు జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. ‘‘నిజాయతీగా చెప్పాలంటే కోచ్ పదవి నాకు భారంగా, బాధ్యతగా అనిపిస్తుంది. ఇంత గొప్ప ప్రదర్శనల్ని విడిచి వెళ్లలేను. క్రీడాకారులకు నా అవసరం ఉంది. అంతర్గతంగా అది నాపై భారమే. అందుకే కోచ్ విధుల్లో పూర్తిగా నిమగ్నమయ్యా. నా వారసుడి గురించి కూడా ఆలోచించలేదు’’ అని గోపీచంద్ తెలిపాడు.