close
ప్రకాశ్‌ ఆల్‌రౌండ్‌ జోరు

ఏబీ కాలనీ విజయం
 ఎ3- డివిజన్‌ వన్డే లీగ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఏబీ కాలనీ ఆటగాడు జ్ఞాన ప్రకాశ్‌ (103 నాటౌట్‌, 2/27) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెలరేగాడు. అతని అజేయ శతకం సాయంతో ఆదివారం జరిగిన ఎ3- డివిజన్‌ వన్డే లీగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో ఏబీ కాలనీ 78 పరుగుల తేడాతో యాదవ్‌ డైరీపై గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఏబీ కాలనీ 50 ఓవర్లలో 9 వికెట్లకు 278 పరుగులు చేసింది. ఆ జట్టులో ప్రకాశ్‌తో పాటు సౌరవ్‌ (72) కూడా ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లలో కార్తీక్‌ (5/51) ఐదు వికెట్లతో విజృంభించాడు. బదులుగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన యాదవ్‌ డైరీ 44.2 ఓవర్లలో 200 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో రోహన్‌ గౌడ్‌ (44) మెరిశాడు. ఏబీ కాలనీ బౌలర్లలో సిద్ధార్థ్‌ రెడ్డి (4/24) నాలుగు వికెట్లతో చెలరేగాడు. ప్రకాశ్‌ రెండు వికెట్లు తీశాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.