close
రాణించిన ప్రసాద్‌, కార్తికేయ

 ఒడిషాపై హైదరాబాద్‌ విజయం
 బీసీసీఐ అండర్‌-23 వన్డే ట్రోఫీ

డెహ్రాడూన్‌: బీసీసీఐ పురుషుల అండర్‌-23 వన్డే ట్రోఫీ క్రికెట్‌ టోర్నీలో హైదరాబాద్‌ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్‌లో రాహుల్‌ రవీందర్‌ (71 నాటౌట్‌), బౌలింగ్‌లో రాజమణి ప్రసాద్‌ (6/19), కార్తికేయ (4/20) మెరవడంతో ఆదివారం మ్యాచ్‌లో హైదరాబాద్‌ 157 పరుగుల తేడాతో ఒడిషాను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 220 పరుగులు చేసింది. మిగతా బ్యాట్స్‌మన్‌ విఫలమైనప్పటికీ రాహుల్‌ చివరి వరకు క్రీజులో నిలిచి జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. ప్రత్యర్థి బౌలర్లలో దెబాసిస్‌ (4/39) నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో ప్రసాద్‌, కార్తికేయ ధాటికి.. ఒడిషా 25.1 ఓవర్లలో 63 పరుగులకే కుప్పకూలింది. ప్రసాద్‌.. టాప్‌ఆర్డర్‌తో పాటు లోయరార్డర్‌ పని పట్టగా.. కార్తికేయ మిడిలార్డర్‌ను పెవిలియన్‌ చేర్చాడు. ఆ జట్టులో రంజన్‌ మిశ్రా (31) టాప్‌స్కోరర్‌.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.