close
హైదరాబాద్‌ విజయం

చండీగఢ్‌: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీని హైదరాబాద్‌ విజయంతో ముగించింది. ఆదివారం జరిగిన గ్రూప్‌-సి మ్యాచ్‌లో హైదరాబాద్‌ 21 పరుగుల ఆధిక్యంతో చత్తీస్‌గఢ్‌పై గెలుపొందింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 174 పరుగులు సాధించింది. తన్మయ్‌ అగర్వాల్‌ (90 నాటౌట్‌; 61 బంతుల్లో 12×4, 1×6), బవనక సందీప్‌ (41 నాటౌట్‌; 16 బంతుల్లో 3×4, 4×6) చెలరేగారు. అనంతరం చత్తీస్‌గఢ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసింది. హైదరాబాద్‌ బౌలర్లు సిరాజ్‌ (2/28), సీవీ మిలింద్‌ (2/15), మెహదీ హసన్‌ 2/13) మెరిశారు. 7 మ్యాచ్‌లాడిన హైదరాబాద్‌ 4 విజయాలు, 3 పరాజయాలతో 16 పాయింట్లు సాధించి గ్రూప్‌-సి పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది.

ఆంధ్ర పరాజయం: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీని ఆంధ్ర ఓటమితో ముగించింది. ఆదివారం జరిగిన గ్రూప్‌-ఎ పోరులో సర్వీసెస్‌ 5 వికెట్ల తేడాతో ఆంధ్రను ఓడించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆంధ్ర 20 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు సాధించింది. క్రాంతికుమార్‌ (43; 36 బంతుల్లో 3×4, 1×6), నరేన్‌రెడ్డి (43; 23 బంతుల్లో 2×4, 4×6) సత్తాచాటారు. బదులుగా సర్వీసెస్‌ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.