close
ఛాంపియన్‌ రుత్విక

పుణె: అఖిల భారత సీనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో తెలుగమ్మాయి గద్దె రుత్విక శివాని (తెలంగాణ) ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం  జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో రుత్విక శివాని 21-10, 21-17తో శ్రుతి (మహారాష్ట్ర)పై విజయం సాధించింది. సామియా ఇమాద్‌ షారూఖీ (తెలంగాణ) కాంస్య పతకం గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో జగదీశ్‌ (ఆంధ్రప్రదేశ్‌) 21-23, 15-21తో సిద్ధార్థ్‌సింగ్‌ (చత్తీస్‌గఢ్‌) చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచాడు.  పురుషుల డబుల్స్‌లో కృష్ణప్రసాద్‌  (ఆంధ్రప్రదేశ్‌)- ష్లోక్‌ (ఏఏఐ) జోడీ రన్నరప్‌గా నిలిచి రజతం సాధించింది. మహిళల డబుల్స్‌లో సామియా- కవిప్రియ (పుదుచ్చేరి).. పురుషుల డబుల్స్‌లో శ్రీకృష్ణ సాయికుమార్‌ (తెలంగాణ)- గౌస్‌ షేక్‌ (ఆంధ్రప్రదేశ్‌) జోడీలకు కాంస్య పతకాలు లభించాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.