
ముంబయి: విరుద్ధ ప్రయోజనాల కేసులో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి క్లీన్చిట్ లభించింది. అతడికి విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదును అంబుడ్స్‌మన్ డీకే జైన్ కొట్టివేశాడు. బంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడైన గంగూలీ, బీసీసీఐ ఏజీఎంలో ఆ సంఘానికి ప్రతినిధిగా కూడా ఉండడంపై మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘానికి చెందిన సంజీవ్ గుప్తా.. అక్టోబరు 4న అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేశాడు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఎవరూ రెండు పాత్రల్లో ఉండడానికి వీల్లేదు. అయితే బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక అక్టోబరు 23న గంగూలీ క్యాబ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో అతడిపై ఫిర్యాదు విలువలేకుండా పోయిందని అంబుడ్స్‌మన్ అన్నాడు. ఫిర్యాదును కొట్టివేస్తున్నట్లు తెలిపాడు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- జయలలితగా రమ్యకృష్ణను చూశారా?
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- ‘అతను నన్ను చంపాలని చూస్తున్నాడు’
- భయం.. కోపం రెండూ వస్తున్నాయి!
- ఆ పాత్రకు అరవిందస్వామి అనుకున్నారట!
- ఎంజీ విద్యుత్తు కారు విశేషాలు ఇవే..
- ఇంటి వరకూ తోడుగా వస్తారు!
- మీ షేర్లు భద్రపర్చుకోండిలా..!
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ఎందుకా పైశాచికం?