
జాతీయ కార్టింగ్ ఛాంపియన్షిప్
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: జాతీయ కార్టింగ్ ఛాంపియన్షిప్ రెండో రౌండ్లో హైదరాబాద్ రేసర్లు అధీత్, గోపాల్ మెరిశారు. సీనియర్ విభాగంలో 9:16.366 నిమిషాల్లో రేసు పూర్తి చేసిన అధీత్ రెండో స్థానంలో నిలిచాడు. సత్యనారాయణన్ (బెంగళూరు- 9:13.764ని) టైటిల్ దక్కించుకున్నాడు. జూనియర్ విభాగంలో 9:35.136ని టైమింగ్‌తో గోపాల్ మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. జుబాల్ (దిల్లీ- 9:29.538ని), అగ్నీశ్వర్ వర్మ (చెన్నై- 9:32.888ని) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఈ ప్రదర్శన కారణంగా అధీత్, గోపాల్ జాతీయ ఛాంపియన్షిప్ ఫైనల్ రౌండ్లో పోటీపడే అవకాశాన్ని కొట్టేశారు. వచ్చే నెల మూడో వారంలో చెన్నైలో ఫైనల్ రౌండ్ జరగనుంది.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి