close
విజృంభించిన జనార్ధన్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: విశాఖ సీసీ బౌలర్‌ జనార్ధన్‌ (6/52) ఆరు వికెట్లతో విజృంభించాడు. పదునైన బంతులతో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. అతని ధాటికి సోమవారం విశాఖ సీసీతో ఆరంభమైన ఎ1- డివిజన్‌ రెండు రోజుల లీగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో రోహిత్‌ ఎలెవన్‌ 61.1 ఓవర్లలో 213 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్‌ లిఖిత్‌ (51), షనావాజ్‌ (51), అర్షద్‌ (42) బ్యాట్‌తో మెరిశారు. విశాఖ బౌలర్లలో జనార్ధన్‌తో పాటు అద్వైత్‌ రెడ్డి (3/51) కూడా రాణించాడు.

ఆకట్టుకున్న వినయ్‌: వినయ్‌ కిరణ్‌ (26 నాటౌట్‌, 5/9) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెలరేగడంతో సికింద్రాబాద్‌ జింఖానా జట్టుతో జరిగిన ఎ3- డివిజన్‌ వన్డే లీగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో మహేశ్‌ సీసీ 183 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన మహేశ్‌ సీసీ 45 ఓవర్లలో 9 వికెట్లకు 249 పరుగులు చేసింది. ఆ జట్టులో వినయ్‌ రెడ్డి (77), రవితేజ (50) అర్ధశతకాలతో సత్తాచాటారు. ప్రత్యర్థి బౌలర్లలో హుస్సేన్‌ (2/43), శ్రావణ్‌ (2/36) చెరో రెండు వికెట్లు తీశారు. బదులుగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన సికింద్రాబాద్‌ జింఖానా.. వినయ్‌ ధాటికి 21 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది. బుల్లెట్‌ లాంటి బంతులతో చెలరేగిన వినయ్‌ ప్రత్యర్థి భరతం పట్టాడు. వినయ్‌తో పాటు శ్రావణ్‌ (3/9), మనీశ్‌ (2/11) కూడా రాణించి జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.

ఎ1- డివిజన్‌ రెండు రోజుల లీగ్‌: రోహిత్‌ ఎలెవన్‌: 213 (లిఖిత్‌ 51, షనావాజ్‌ 51, అర్షద్‌ 42, జనార్ధన్‌ 6/52, అద్వైత్‌ 3/51), విశాఖ సీసీ;  ఎ3- డివిజన్‌ వన్డే లీగ్‌: మహేశ్‌ సీసీ: 249 (వినయ్‌ రెడ్డి 77, రవితేజ 50, వినయ్‌ కిరణ్‌ 26 నాటౌట్‌, హుస్సేన్‌ 2/43, శ్రావణ్‌ 2/36), సికింద్రాబాద్‌ జింఖానా: 66 (వినయ్‌ కిరణ్‌ 5/9, శ్రావణ్‌ 3/9, మనీశ్‌ 2/11); * హెచ్‌సీఏ అకాడమీ: 186 (ప్రవీణ్‌ 53, రామ్‌ కిశోర్‌ 3/25, అభిషేక్‌ పాటిల్‌ 2/45, లియాన్‌ 2/29), భరత్‌ సీసీ: 151 (కిశోర్‌ 34, వేదాంత్‌ 4/33, శ్రీనికేత్‌ 4/27)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.