close
మన అమ్మాయిలు మళ్లీ..

ప్రావిడెన్స్‌: వెస్టిండీస్‌ పర్యటనలో భారత మహిళల క్రికెట్‌ జట్టు దూకుడు మీదుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే 3-0తో గెలుచుకున్న టీమ్‌ఇండియా... నాలుగో మ్యాచ్‌లోనూ మెరిసింది. 5 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. వర్షం కారణంగా 9 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌..7 వికెట్లకు 50 పరుగులు సాధించింది. హేలీ మాథ్యూస్‌ (3/13), ఫ్లెచర్‌ (2/2), గ్రిమండ్‌ (2/10) రాణించారు. ఛేదనలో అనూజ పాటిల్‌ (2/8), రాధాయాదవ్‌ (1/8), దీప్తిశర్మ (1/8) ధాటికి విండీస్‌ 9 ఓవర్లలో 5 వికెట్లకు 45 పరుగులే చేయగలిగింది. చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి రాగా.. రెండు వికెట్లు నష్టపోయిన విండీస్‌ ఏడు పరుగులే చేయగలిగింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిక్యాన్ని భారత్‌ 4-0కు పెంచుకుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.