close
సుదర్శన్‌ మెరుపు శతకం

మహేశ్‌ సీసీ విజయం
ఎ3- డివిజన్‌ వన్డే లీగ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎ3- డివిజన్‌ వన్డే లీగ్‌ క్రికెట్‌ టోర్నీలో మహేశ్‌ సీసీ ఓపెనర్‌ సుదర్శన్‌ (115; 94 బంతుల్లో 16×4, 4×6) శతకంతో సత్తాచాటాడు. అతని సెంచరీ సాయంతో సేక్రెడ్‌ హార్ట్‌ సీసీతో జరిగిన మ్యాచ్‌లో మహేశ్‌ సీసీ 41 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన మహేశ్‌ సీసీ 44.4 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. సుదర్శన అద్భుతమైన ఆటతీరుతో జట్టుకు భారీ స్కోరు అందించాడు. వంశీ (57) అర్ధశతకంతో అతనికి సహకరించాడు. ప్రత్యర్థి బౌలర్లలో లెస్టీ (3/41), స్టాన్లీ (2/39) ఆకట్టుకున్నారు. బదులుగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన సేక్రెడ్‌ హార్ట్‌ సీసీ 40.2 ఓవర్లలో 239 పరుగులకు కుప్పకూలింది. ఆ జట్టులో లెస్టీ (51) అర్ధ శతకం చేశాడు. మనీశ్‌ (2/28), రమేశ్‌ (2/28), సాయికుమార్‌ (2/42), అఖిల్‌ (3/46) సమష్టిగా రాణించి ప్రత్యర్థిని కట్టడి చేశారు.

రాణించిన ఫహీముద్దీన్‌: కెప్టెన్‌ ఫహీముద్దీన్‌ ఖాజా (4/18) స్పిన్‌తో చెలరేగడంతో సటన్‌ సీసీతో జరిగిన మ్యాచ్‌లో నోబుల్‌ సీసీ 196 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన నోబుల్‌ సీసీ 35 ఓవర్లలో 6 వికెట్లకు 384 పరుగుల భారీ స్కోరు సాధించింది. రక్షిత్‌ (60), అశ్విన్‌ సూరజ్‌ (62), ఆకాశ్‌ (53), శ్రావణ్‌ (64 నాటౌట్‌) అర్ధశతకాలతో చెలరేగారు. ప్రత్యర్థి బౌలర్లలో కెవిన్‌ (5/32) ఐదు వికెట్లతో విజృంభించాడు. అనంతరం ఛేదనలో సటన్‌ సీసీ 30 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో ఆర్యన్‌ (59), అభినవ్‌ (53 నాటౌట్‌) మెరిశారు. బౌలింగ్‌లో ఫహీముద్దీన్‌తో పాటు కృష్ణకాంత్‌ తివారీ (3/38), మహమ్మద్‌ ఆసిమ్‌ (3/56) కూడా రాణించి ప్రత్యర్థిని కట్టడి చేశారు.
ఎ3- డివిజన్‌ వన్డే లీగ్‌: బీ మహేశ్‌ సీసీ: 280 (సుదర్శన్‌ 115, వంశీ 57, లెస్టీ 3/41, స్టాన్లీ 2/39), సేక్రెడ్‌ హార్ట్‌: 239 (లెస్టీ 51, అఖిల్‌ 3/46, సాయికుమార్‌ 2/42, రమేశ్‌ 2/28, మనీశ్‌ 2/28); బీ నోబుల్‌ సీసీ: 384/6 (రక్షిత్‌ 60, అశ్విన్‌ సూరజ్‌ 62, ఆకాశ్‌ 53, శ్రావణ్‌ 64 నాటౌట్‌, కెవిన్‌ 5/32), సటన్‌ సీసీ: 188 (ఆర్యన్‌ 59, అభినవ్‌ 53 నాటౌట్‌, ఫహీముద్దీన్‌ ఖాజా 4/18, కృష్ణకాంత్‌ తివారీ 3/38, మహమ్మద్‌ ఆసిమ్‌ 3/56)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.