
పోకారా (నేపాల్): దక్షిణ ఆసియా క్రీడలు (సాగ్)లో భారత్ అదరగొట్టింది. సోమవారం ఒక్క బ్యాడ్మింటన్లోనే రెండు స్వర్ణాలు ఖాతాలో వేసుకుంది. బ్యాడ్మింటన్ పురుషుల టీమ్ విభాగంలో కిదాంబి శ్రీకాంత్ నేతృత్వంలోని భారత్ ఫైనల్లో 3-1తో శ్రీలంకను ఓడించి పసిడి గెలిచింది. మహిళల టీమ్ తుది సమరంలో భారత్ 3-0తో లంకను చిత్తు చేసింది. పురుషుల ట్రయథ్లాన్ వ్యక్తిగత విభాగంలో ఆదర్శ సినిమోల్ స్వర్ణం గెలిచాడు. మహిళల వ్యక్తిగత ట్రయథ్లాన్లోనూ భారత్ రెండు పతకాలు ఖాతాలో వేసుకుంది. సరోజిని రజతం, ప్రజ్ఞ కాంస్యం నెగ్గారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- పాక్క్రికెట్ను బాగుచేసే మంత్రదండం లేదు