close
అంజలి 6/0

మహిళల టీ20ల్లో ప్రపంచ రికార్డు

పొఖారా (నేపాల్‌): నేపాలీ మహిళా పేసర్‌ అంజలి చాంద్‌ (6/0) సంచలన బౌలింగ్‌తో చరిత్ర సృష్టించింది. మహిళల టీ20 క్రికెట్లో అత్యుత్తమ గణాంకాలతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఆమె  మలేసియా బౌలర్‌ ఎలీసా (6/3) రికార్డును బద్దలు కొట్టింది. ఒక్క పరుగూ ఇవ్వకుండానే ఆరు వికెట్లు పడగొట్టిన అంజలి.. అంతర్జాతీయ క్రికెట్లో (మహిళల, పురుషులు) ఆ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌గానూ నిలిచింది. ఆ ఆరు వికెట్లలో చివరి మూడు హ్యాట్రిక్‌ రూపంలో దక్కాయి. సోమవారం దక్షిణాసియా క్రీడల్లో భాగంగా నేపాల్‌, మాల్దీవులు జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటు చేసుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన మాల్దీవులు జట్టు.. అంజలి ధాటికి 10.1 ఓవర్లలో 16 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో తొమ్మిది మంది బ్యాటర్లు ఖాతానే తెరవలేదు. అనంతరం నేపాల్‌ కేవలం 5 బంతుల్లోనే లక్ష్యాన్ని అందుకుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.