close
మహా స్టేడియం.. మెగా మ్యాచ్‌తో!

అహ్మదాబాద్‌: ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంగా రూపుదిద్దుకున్న గుజరాత్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్టేడియం (మొతెరా) ఓ ప్రత్యేక మ్యాచ్‌తో ఆరంభమయ్యే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో ప్రపంచ ఎలెవన్‌, ఆసియా ఎలెవన్‌ మధ్య మ్యాచ్‌తో ఈ స్టేడియాన్ని అందుబాటులోకి తేవాలని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ భావిస్తున్నాడు.  దీని సామర్థ్యం లక్షా 10 వేలు. ఇది అందుబాటులోకి వస్తే మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానం (1,00024)ను అధిగమించి ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా నిలుస్తుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఐసీసీ అనుమతి లభించాల్సి ఉంది. 2017 జనవరి 16న గుజరాత్‌ క్రికెట్‌ సంఘం ఈ మెగా స్టేడియానికి శ్రీకారం చుట్టింది. పాత మొతెరా మైదానాన్ని పూర్తి కూల్చి.. రూ.700 కోట్లతో కొత్త స్టేడియాన్ని నిర్మించింది. గతంలో మొతెరా స్టేడియంలో గరిష్టంగా 54 వేల మంది మ్యాచ్‌ చూసే అవకాశం ఉండేది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.