close

ప్రధానాంశాలు

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ ఓటమి

కర్ణాటక చేతిలో చిత్తు
సీకే నాయుడు ట్రోఫీ

షిమోగ (బెంగళూరు): సీకే నాయుడు (అండర్‌-23) ట్రోఫీ క్రికెట్‌ టోర్నీని హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ ఓటమితో మొదలెట్టింది. శనివారం కర్ణాటకతో ముగిసిన మ్యాచ్‌లో ఆ జట్టు ఇన్నింగ్స్‌ 66 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 208 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన హైదరాబాద్‌ 142 పరుగులకే ఆలౌటైంది. అజయ్‌ దేవ్‌గౌడ్‌ (44 నాటౌట్‌) మినహా మిగతా బ్యాట్స్‌మన్‌ విఫలమయ్యారు. కర్ణాటక బౌలర్లలో సంతోఖ్‌ సింగ్‌ (3/33), అభిషేక్‌ (3/26) సత్తాచాటి హైదరాబాద్‌ను కట్టడి చేశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌ 202 పరుగులకు ఆలౌటవగా.. కర్ణాటక 410 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో కర్ణాటక ఖాతాలో ఏడు పాయింట్లు చేరాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.