close

ప్రధానాంశాలు

సత్తాచాటిన నితిన్‌

ఐటా పురుషుల టోర్నీ

డెహ్రాడూన్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) పురుషుల టోర్నీలో తెలంగాణ ఆటగాడు నితిన్‌ సత్తాచాటాడు. సింగిల్స్‌, డబుల్స్‌ విభాగాల్లో టైటిళ్లతో మెరిశాడు. శనివారం జరిగిన సింగిల్స్‌ ఫైనల్లో నితిన్‌ 6-4, 6-4 తేడాతో ఆకాశ్‌ (మధ్యప్రదేశ్‌)పై గెలిచాడు. టోర్నీ ఆరంభం నుంచి మంచి ప్రదర్శనతో దూసుకెళ్తోన్న అతను తుదిపోరులోనూ స్థాయికి తగ్గ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తుచేసి ఛాంపియన్‌గా నిలిచాడు. డబుల్స్‌ టైటిల్‌్ పోరులో నితిన్‌- ఆదిత్య జోడీ 6-1, 6-3తో క్షితిజ్‌- ఆయూష్‌ జంటపై విజయం సాధించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.