close

ప్రధానాంశాలు

3 నుంచి హైదరాబాద్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ఆరో హైదరాబాద్‌ హ్యాండ్‌బాల్‌ స్కూల్‌ లీగ్‌-2019 పోటీలు జనవరి 3 నుంచి 5 వరకు జరగనున్నాయి. క్రీడలకు సంబంధించిన మస్కట్‌ బ్రోచర్‌ను శనివారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో సీనియర్‌ క్రీడాకారుడు రంగారావు ఆవిష్కరించారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఎలాంటి రుసుము లేదని, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ నెల 29 లోగా 9849194841 నంబరులో సంప్రదించాలని హ్యాండ్‌బాడ్‌ స్కూల్‌ గేమ్స్‌ ఛైర్మన్‌ కల్యాణ్‌ చక్రవర్తి, కార్యదర్శి జగన్‌, హైదరాబాద్‌ హ్యాండ్‌బాల్‌ సంఘం కార్యదర్శి ఫాంక్లిన్‌ చెప్పారు. గత ఏడాది టోర్నీలో 50 బాలికల, 50 బాలుర జట్లు పాల్గొన్నాయని.. ఈ సారి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ జిల్లా యూత్‌ స్పోర్ట్స్‌ అధికారి కె.సుధాకర్‌, కోచ్‌ సయ్యద్‌ ముస్తఫా అలీఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.