close

ప్రధానాంశాలు

అగ్రస్థానానికి ఆంధ్ర

హైదరాబాద్‌పై ఘన విజయం
రంజీ ట్రోఫీ గ్రూప్‌-ఎ మ్యాచ్‌

ఒంగోలు: రంజీ ట్రోఫీలో ఆంధ్ర సత్తాచాటుతోంది. వరుసగా రెండో విజయంతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మంగళవారం ముగిసిన రంజీ ట్రోఫీ గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో ఆంధ్ర ఇన్నింగ్స్‌, 96 పరుగుల ఆధిక్యంతో హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 45/3తో నాలుగో రోజు ఉదయం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన హైదరాబాద్‌ 74.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. ఆల్‌రౌండర్‌ రవితేజ (72 నాటౌట్‌; 144 బంతుల్లో 8×4, 3×6) ఒంటరి పోరాటం చేశాడు. ఆంధ్ర పేసర్‌ విజయ్‌కుమార్‌ (5/25) ఐదు వికెట్లతో విజృంభించాడు. పేసర్లు పృథ్వీరాజ్‌ (3/53), శశికాంత్‌ (2/25) రాణించారు. భారీ విజయం సాధించిన ఆంధ్ర బోనస్‌తో సహా 7 పాయింట్లు కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 2 డ్రాలతో మొత్తం 21 పాయింట్లు గెలుచుకున్న ఆంధ్ర గ్రూప్‌-ఎ పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఐదింట్లో 4 ఓటములు, ఒక విజయంతో 6 పాయింట్లకే పరిమితమైన హైదరాబాద్‌ చివరి నుంచి రెండో స్థానానికి (8వ) పరిమితమైంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.