close

ప్రధానాంశాలు

సానియా శుభారంభం

హోబర్ట్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీ

హోబర్ట్‌: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా విజయంతో పునరాగమనం చేసింది. రెండేళ్ల తర్వాత ప్రొఫెషనల్‌ టెన్నిస్‌లో అడుగుపెట్టిన సానియా.. హోబర్ట్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో సానియా- నదియా (ఉక్రెయిన్‌) 2-6, 7-6 (3), 10-3తో ఓక్సానా (జార్జియా)- మియు (జపాన్‌)పై నెగ్గి క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్స్‌లో వేనియా కింగ్‌- క్రిస్టినా మెక్‌హేల్‌ (అమెరికా) జంటతో సానియా జోడీ తలపడుతుంది. ‘‘నా జీవితంలో అత్యంత చిరస్మరణీయమైన రోజుల్లో ఇదొకటి. తల్లిదండ్రులు, బుల్లి తనయుడి సమక్షంలో మ్యాచ్‌ ఆడి గెలవడం ఆనందంగా ఉంది’’ అని ట్విటర్‌లో సానియా పేర్కొంది. ఈ టోర్నీకి ముందు సానియా చివరగా 2017 అక్టోబరులో చైనా ఓపెన్‌ ఆడింది. మోకాలి గాయం.. ఆ తర్వాత బిడ్డకు జన్మనివ్వడం కారణంగా ఆమె రెండేళ్లకుపైగా ఆటకు దూరమైంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.