close

ప్రధానాంశాలు

వికెట్‌ పడకుండానే.. అండర్‌-19 ప్రపంచకప్‌

భారత్‌ భారీ విజయం
41 పరుగులకే కుప్పకూలిన జపాన్‌

బ్లూమ్‌ఫోంటీన్‌

అండర్‌-19 క్రికెట్‌ ప్రపంచకప్‌లో పసికూన జపాన్‌ను డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ ఓ ఆటాడుకుంది. ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయిన ఈ అసోసియేట్‌ జట్టును చిత్తు చిత్తుగా ఓడించింది. మంగళవారం జరిగిన పోరులో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న జపాన్‌.. భారత బౌలర్ల ధాటికి 22.5 ఓవర్లలో కేవలం 41 పరుగులకే కుప్పకూలింది. 5 పరుగులకే తొలి రెండు వికెట్లు కోల్పోయిన జపాన్‌.. ఒక దశలో 19 పరుగులకే 7 వికెట్లు నష్టపోయింది. డోబెల్‌ (7), క్లైమెంట్స్‌ (5) కాసేపు నిలవడంతో ఆ జట్టు ఆ స్కోరైనా సాధించగలిగింది. జపాన్‌ ఇన్నింగ్స్‌లో అయిదుగురు బ్యాట్స్‌మెన్‌ డకౌట్‌ అయ్యారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్‌ (8-3-5-4), కార్తీక్‌ త్యాగి (6-0-10-3), ఆకాశ్‌ సింగ్‌ (4.5-1-11-2) సత్తా చాటారు. అనంతరం ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (29 నాటౌట్‌; 18 బంతుల్లో 5×4, 1×6), కుమార్‌ కుశాగ్ర (13 నాటౌట్‌; 11 బంతుల్లో 2×4) ధాటిగా ఆడటంతో భారత్‌ 4.5 ఓవర్లలోనే, వికెట్‌ కోల్పోకుండా విజయం సాధించింది.   తొలి మ్యాచ్‌లో యువ భారత్‌.. శ్రీలంకపై గెలిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం న్యూజిలాండ్‌తో ఇండియా తలపడనుంది.

జపాన్‌: 22.5 ఓవర్లలో 41 ఆలౌట్‌ (నౌగుచి 7, డోబెల్‌ 7,  క్లైమెంట్స్‌ 5; కార్తీక్‌ త్యాగి 3/10, ఆకాశ్‌సింగ్‌ 2/11, రవి బిష్ణోయ్‌ 4/5, విద్యాధర్‌ పాటిల్‌ 1/8) భారత్‌: 4.5 ఓవర్లలో 42/0 (యశస్వి జైస్వాల్‌ 29 నాటౌట్‌; కుశాగ్ర 13 నాటౌట్‌)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.