close

ప్రధానాంశాలు

సాయి ప్రణీత్‌ ఓటమి

చెన్నై: ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో చెన్నై సూపర్‌ స్టార్జ్‌ 4-3తో బెంగళూరు రాప్టర్స్‌ను ఓడించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్‌ సాయి రాజు, ధ్రువ్‌ జోడీ విజయం సాధించి జట్టును గెలిపించారు. బెంగళూరు ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంచుకున్న మిక్స్‌డ్‌ డబుల్స్‌లో పెంగ్‌ చాన్‌- హ్యూ వాన్‌ జోడీ 15-7, 15-8తో ధ్రువ్‌- జెస్సికా (చెన్నై)పై గెలిచింది. అనంతరం పురుషుల సింగిల్స్‌లో బెంగళూరు ఆటగాడు సాయి ప్రణీత్‌ 13-15, 15-10, 11-15తో టామీ చేతిలో ఓడాడు. చెన్నై ట్రంప్‌ మ్యాచ్‌గా ఎన్నుకున్న మరో పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ 15-5, 15-4తో లెవర్డ్‌పై గెలిచి ఆ జట్టుకు 3-2తో ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ 13-15, 15-6, 15-6తో గాయత్రి గోపీచంద్‌పై నెగ్గడంతో స్కోరు 3-3తో సమమైంది. నిర్ణయాత్మక పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ జంట (చెన్నై) 13-15, 15-9, 15-9తో పి.ఎస్‌. చరణ్‌, సపుత్ర జోడీపై నెగ్గింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.