close

ప్రధానాంశాలు

ఛాంప్‌ హైదరాబాద్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: అఖిల భారత రాజీవ్‌గాంధీ అండర్‌-19 టీ20 ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ విజేతగా నిలిచింది. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆ జట్టు 6 పరుగుల తేడాతో తమిళనాడుపై గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటైంది. ప్రతీక్‌ (24), గౌరవ్‌ (23) రాణించారు. అనంతరం ఛేదనలో తమిళనాడు 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులే చేయగలిగింది. హైదరాబాద్‌ బౌలర్లు వరుణ్‌ గౌడ్‌ (2/26), అనిరుధ్‌ (2/20), కెవిన్‌ (2/26), కౌశిక్‌రెడ్డి (2/4) సమష్టిగా మెరిసి ప్రత్యర్థిని కట్టడి చేశారు. హరియాణా మాజీ సీఎం భూపీందర్‌ సింగ్‌, మాజీ రాజ్యసభ సభ్యుడు హనుమంత రావు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.