close

ప్రధానాంశాలు

ఆఖర్లో ఎంగిడి మాయ

ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా గెలుపు

ఈస్ట్‌ లండన్‌ (దక్షిణాఫ్రికా): ఆఖరి ఓవర్లో పేసర్‌ ఎంగిడి (3/30) విజృంభించడంతో తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఒక్క పరుగు తేడాతో ఇంగ్లాండ్‌పై నెగ్గింది. మొదట బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 177 పరుగులు సాధించింది. బవుమా (43) టాప్‌ స్కోరర్‌. అనంతరం ఇంగ్లాండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 176 పరుగులు చేయగలిగింది. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (70; 38 బంతుల్లో 7×4, 3×6), కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (52; 34 బంతుల్లో 7×4, 1×6) సత్తాచాటడంతో ఒకదశలో ఇంగ్లాండ్‌ లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. అయితే చివరి ఓవర్లో ఇంగ్లాండ్‌ పరిస్థితి తలకిందులైంది. 19వ ఓవర్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో మోర్గాన్‌ చెలరేగాడు. అప్పటికి స్కోరు 171/5. ఆ సమయంలో 7 బంతుల్లో 7 పరుగులు చేస్తే ఇంగ్లాండ్‌దే విజయం. హెండ్రిక్స్‌ (2/33) చివరి బంతికి మోర్గాన్‌ను ఔట్‌ చేయడంతో కథ అడ్డం తిరిగింది. 6 బంతుల్లో 7 పరుగులు కావాల్సిన సమయంలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఎంగిడి విజృంభించాడు. తొలి 5 బంతుల్లో 4 పరుగులే ఇచ్చి కరన్‌ (2), మొయీన్‌ అలీ (5)లను ఔట్‌ చేశాడు. రెండు పరుగులు సాధిస్తే మ్యాచ్‌ టై అవుతుంది. అయితే చివరి బంతికి సింగిల్‌ తీసిన రషీద్‌ (1) రెండో పరుగు కోసం ప్రయత్నించి రనౌటవడంతో దక్షిణాఫ్రికా జట్టు సంబరాల్లో మునిగిపోయింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.