close

ప్రధానాంశాలు

పాక్‌తో సిరీస్‌ ఇప్పుడు ఆడలేం!

జొహనెస్‌బర్గ్‌: తమ ఆటగాళ్ల పనిభారం కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్‌లో టీ20 సిరీస్‌ ఆడలేమని దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు శుక్రవారం ప్రకటించింది. ముందుగా ప్రతిపాదించిన ప్రకారం భారత్‌తో మూడు వన్డేలు ఆడిన తర్వాత మూడు టీ20ల సిరీస్‌ కోసం ఆ జట్టు పాక్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ తమ ఆటగాళ్లపై అధిక పని ఒత్తిడి పడుతుందని, ఆ సిరీస్‌ను వాయిదా వేసి రెండు క్రికెట్‌ బోర్డులకు సమ్మతమైన రోజుల్లో నిర్వహించుకుందామని క్రికెట్‌ దక్షిణాఫ్రికా పేర్కొంది. ఇంగ్లాండ్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లను ముగించిన సఫారీ జట్టు.. ప్రస్తుతం టీ20లు ఆడుతోంది. ఆ తర్వాత స్వదేశంలో ఆసీస్‌తో మూడేసి వన్డేలు, టీ20ల సిరీస్‌లో తలపడనుంది. వెంటనే వన్డే సిరీస్‌ కోసం భారత్‌కు రానుంది. ఈ షెడ్యూల్‌ వల్ల ఆటగాళ్లు అలసిపోతారని బోర్డు భావిస్తోంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.