close

ప్రధానాంశాలు

విజేత ఆంధ్రప్రదేశ్‌

ఎఫ్‌సీఐ సౌత్‌జోన్‌ క్రికెట్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) సౌత్‌జోన్‌ అంతర్‌ ప్రాంతీయ క్రికెట్‌ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌ విజేతగా నిలిచింది. బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఆ జట్టు నాలుగు పరుగుల తేడాతో తమిళనాడుపై విజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రప్రదేశ్‌ 12 ఓవర్లలో 5 వికెట్లకు 84 పరుగులు చేసింది. నవీన్‌ (27), రాజశేఖర్‌ (26 నాటౌట్‌) బ్యాట్‌తో సత్తాచాటారు. ప్రత్యర్థి బౌలర్లలో సతీశ్‌ (3/13) మూడు వికెట్లతో మెరిశాడు. అనంతరం ఛేదనలో తమిళనాడు 12 ఓవర్లలో ఆరు వికెట్లకు 80 పరుగులే చేయగలిగింది. ఆ జట్టులో బాలాకుమార్‌ (25 నాటౌట్‌), గంగాధరన్‌ (21) పోరాడారు. ఆంధ్రప్రదేశ్‌ బౌలర్‌ సుమిత్‌ (2/7) రెండు వికెట్లు పడగొట్టాడు. తెలంగాణ ప్రాంతీయ జనరల్‌ మేనేజర్‌ అశ్విని కుమార్‌ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు.

ఆంధ్రప్రదేశ్‌: 84/5 (నవీన్‌ 27, రాజశేఖర్‌ 26 నాటౌట్‌, సతీశ్‌ 3/13), తమిళనాడు: 80/6 (బాలాకుమార్‌ 25 నాటౌట్‌, గంగాధరన్‌ 21, సుమిత్‌ 2/7)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.