close

ప్రధానాంశాలు

మెరిసిన స్రవంతి, శ్రావణి

 హైదరాబాద్‌ విజయం
 సీనియర్‌ మహిళల వన్డే టోర్నీ

సూరత్‌: బీసీసీఐ సీనియర్‌ మహిళల వన్డే టోర్నీలో హైదరాబాద్‌ విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 63 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది. స్రవంతి నాయుడు (66; 124 బంతుల్లో 12×4) అర్ధశతకానికి తోడు అనురాధ నాయక్‌ (41), మమత (37) బ్యాట్‌తో మెరిశారు. ప్రత్యర్థి బౌలర్లలో గీత (2/27) రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం ఛేదనలో ఉత్తరాఖండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులే చేయగలిగింది. ఆ జట్టులో రాధా చంద్‌ (27), తోమర్‌ (20) చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. హైదరాబాద్‌ బౌలర్లలో శ్రావణి (3/13), కావ్య (2/28), యశశ్రీ (2/17) సమష్టిగా రాణించి ప్రత్యర్థిని కట్టడి చేశారు.

హైదరాబాద్‌: 190/6 (స్రవంతి నాయుడు 66, అనురాధ నాయక్‌ 41, మమత 37, గీత 2/27), ఉత్తరాఖండ్‌: 127/9 (రాధా చంద్‌ 27, తోమర్‌ 20, శ్రావణి 3/13, కావ్య 2/28, యశశ్రీ 2/17)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.