close

ప్రధానాంశాలు

సైనా, శ్రీకాంత్‌ శుభారంభం

బార్సిలోనా: బార్సిలోనా స్పెయిన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్‌ సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌ శుభారంభం చేశారు. బుధవారం తొలిరౌండ్లో సైనా 21-16, 21-14 తేడాతో ఇవాన్‌ లీ (జర్మనీ)పై విజయం సాధించగా.. శ్రీకాంత్‌ 23-21, 21-18తో సహచరుడు శుభాంకర్‌ డేను ఓడించాడు. అజయ్‌ జయరాం 21-14,   21-12తో క్రిస్టో (ఫ్రాన్స్‌)ను చిత్తుచేశాడు. మరోవైపు ప్రణయ్‌ కథ ముగిసింది. తొలి రౌండ్లో అతను 18-21, 15-21తో డారెన్‌ లీ (మలేషియా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. కశ్యప్‌ గాయం కారణంగా తొలి రౌండ్‌ మ్యాచ్‌ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలిరౌండ్లో ప్రణవ్‌- సిక్కిరెడ్డి జోడీ 10-21, 21-16, 21-17తో క్రిస్టియాన్సెన్‌- అలెగ్జాండ్రా (డెన్మార్క్‌)పై గెలిచింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.