close

ప్రధానాంశాలు

హైదరాబాద్‌ బుల్స్‌ బోణీ

సైబరాబాద్‌పై విజయం
టీపీకేఎల్‌ మూడో సీజన్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలంగాణ ప్రిమియర్‌ కబడ్డీ లీగ్‌ (టీపీకేఎల్‌) మూడో సీజన్‌లో హైదరాబాద్‌ బుల్స్‌ శుభారంభం చేసింది. ఆదివారం యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 35-28 తేడాతో సైబరాబాద్‌ ఛార్జర్స్‌పై విజయం సాధించింది. ట్యాక్లింగ్‌లో పవన్‌ కుమార్‌ (9) రాణించి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. రాజ్‌ కుమార్‌ (15) రైడింగ్‌లో అరదగొట్టినా సైబరాబాద్‌ను గెలిపించలేకపోయాడు. మ్యాచ్‌ ఆరంభం నుంచి హైదరాబాద్‌ ఆధిపత్యం చలాయించింది. తొలి అర్ధభాగాన్ని ఆ జట్టు 15-9తో ముగించింది. విరామం తర్వాత కూడా హైదరాబాద్‌ దూకుడు కొనసాగించింది. అయితే మరోవైపు రాజ్‌ కుమార్‌ వరుసగా రైడ్‌ పాయింట్లు తేవడంతో సైబరాబాద్‌ తిరిగి పుంజుకున్నట్లే కనిపించింది. ఓ దశలో ప్రత్యర్థిని అందుకుంటుందేమో అనిపించింది. కానీ పవన్‌ ప్రత్యర్థికి ఆ అవకాశం ఇవ్వలేదు. ట్యాక్లింగ్‌లో మంచి నైపుణ్యాలు ప్రదర్శించిన అతను జట్టుకు విజయాన్ని అందించాడు. సోమవారం మ్యాచ్‌లో కరీంనగర్‌ కింగ్స్‌తో మంచిర్యాల్‌ టైగర్స్‌ తలపడనుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.