close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వచ్చే ఏడాది నిర్వహిస్తాం

ప్రపంచకప్‌పై ఐసీసీకి సీఏ సమాధానం!

మెల్‌బోర్న్‌: వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ నిర్వహణకు తాము సిద్ధమని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఐసీసీకి తెలిపింది! 2022కు బదులు 2021లోనే పొట్టి కప్పుకు ఆతిథ్యమిస్తామంటూ ఐసీసీకి ఇచ్చిన సమాధానంలో సీఏ పేర్కొందని సమాచారం. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది పొట్టి కప్పు నిర్వహణ సాధ్యం కాకపోతే ఎప్పుడు ఆతిథ్యమిస్తారంటూ సీఏను ఐసీసీ అడిగింది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌కు భారత్‌ ఆతిథ్యమిస్తున్నందున.. అక్టోబరు- నవంబరులో ఆస్ట్రేలియాలో జరగాల్సిన కప్పును 2022లో నిర్వహించాలంటూ సూచనలు వచ్చాయి. సీఏ మాత్రం 2021కే తమ ప్రాధాన్యమని చెప్పిందట. సీఏ ఛైర్మన్‌ ఎడింగ్స్‌ ఇదే విషయాన్ని ఐసీసీకి స్పష్టం చేశాడని ‘ది ఆస్ట్రేలియన్‌’ పత్రిక వెల్లడించింది. ప్రపంచకప్‌ రద్దయితే తమకు 80 మిలియన్ల అమెరికన్‌ డాలర్లు (సుమారు రూ.400 కోట్లు) నష్టమని సీఏ సీఈఓ కెవిన్‌ రాబర్ట్స్‌ తెలిపాడు. అయితే 2021 ఆతిథ్య హక్కులు వదులుకునేందుకు సిద్ధంగా లేమని బీసీసీఐ అధికారి తెలిపాడు. ‘‘2021 ఆతిథ్య హక్కులు సీఏకు అప్పగించి.. 2022లో టోర్నీ నిర్వహించాలంటూ ఓ ఆలోచన ఉంది. అలా జరిగే అవకాశం లేదు. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ జరగపోతే 2022లో ఉంటుంది’’ అని బీసీసీఐ అధికారి చెప్పాడు.
ఒకే స్టేడియంలో ఆడించొచ్చు: సీఏ
కరోనా మహమ్మారి పరిస్థితుల ప్రకారం టీమ్‌ఇండియా టెస్టు సిరీస్‌ షెడ్యూల్‌లో అవసరమైతే మార్పులు ఉంటాయని సీఏ పేర్కొంది. డిసెంబరు 3 నుంచి జనవరి 7 మధ్యలో ఆస్ట్రేలియాతో టీమ్‌ఇండియా 4 టెస్టులు ఆడుతుంది. ‘‘దేశీయ ప్రయాణాల కోసం 4 రాష్ట్రాల సరిహద్దులు తెరిచి ఉన్నప్పుడు షెడ్యూల్‌ యధావిధిగా కొనసాగుతుంది. ప్రతికూల పరిస్థితులు నెలకొంటే ఒకటి లేదా రెండు స్టేడియాల్లోనే మ్యాచ్‌లు నిర్వహించొచ్చు. ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం’’ అని సీఏ సీఈఓ కెవిన్‌ రాబర్ట్స్‌ తెలిపాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.