close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఖాళీ స్టేడియాల్లో అండర్‌-17 ప్రపంచకప్‌!

దిల్లీ: కరోనా కారణంగా దేశంలో రాబోయే నెలల్లో పరిస్థితి మరింత తీవ్రమైతే అభిమానులు లేకుండా మహిళల అండర్‌-17 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను నిర్వహిస్తామని అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) వెల్లడించింది. సవరించిన షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7 వరకు ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఏఐఎఫ్‌ఎఫ్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘కరోనా కారణంగా పరిస్థితి మరింత విషమిస్తే అండర్‌-17 ప్రపంచకప్‌ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తాం. ఇలా చేయడం బాధాకరమే కానీ మనుషుల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదు’’ అని ఏఐఎఫ్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి కుశాల్‌ దాస్‌ చెప్పాడు. ఈ టోర్నీ కోసం ఆగస్టులో శిబిరాన్ని నిర్వహించేందుకు జార్ఖండ్‌ ఆసక్తి ప్రదర్శిస్తోందని దాస్‌ తెలిపాడు. ‘‘శిబిరాల గురించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతున్నాం. అండర్‌-17 జట్టులో తమ రాష్ట్రానికి చెందిన అమ్మాయిలు ఎనిమిది మందికిపైగా ఉండడంతో జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ తమ రాష్ట్రంలో శిబిరం నిర్వహించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఆగస్టు 15లోగా ఈ శిబిరం మొదలు కావడం ఖాయం’’ అని దాస్‌ పేర్కొన్నాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.