close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఐపీఎల్‌ ఆదాయమే దేశవాళీ క్రికెట్‌కు ఆధారం

దిల్లీ: ఐపీఎల్‌ వల్ల వచ్చే ఆదాయమే భారత దేశవాళీ క్రికెట్‌కు ఆధారమని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. ‘‘ఐపీఎల్‌ లాంటి టోర్నీల ద్వారా ఎంతో ఆదాయం వస్తుంది. ఆటగాళ్లు లేదా బీసీసీఐ పొందే రాబడి గురించి అంతా చర్చిస్తారు. కానీ ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుందో ఆలోచించరు. అండర్‌-19, అండర్‌-16 లాంటి టోర్నీల నిర్వహణ కోసం ఆ ధనాన్ని రాష్ట్ర సంఘాలకు పంపిస్తారు. ఆ డబ్బు ఆటలోనే కొనసాగుతోంది. దేశవాళీ టోర్నీల ద్వారా ఆదాయం రాదనేది వాస్తవం. వాటి నిర్వహణకే ఎంతో ఖర్చు అవుతుంది. ప్రతిభావంతులైన అమ్మాయిలు, అబ్బాయిలను వెలుగులోకి తీసుకురావాలంటే ఆ టోర్నీలు నిర్వహించాల్సిందే. వాటికి డబ్బు ఎక్కడి నుంచో రావాల్సిందే. అత్యుత్తమ ఆటగాళ్లను తీర్చిదిద్దడానికి చాలా డబ్బు కావాలి. ఐపీఎల్‌ ద్వారా వచ్చే ఆదాయం దేశంలో దేశవాళీ క్రికెట్‌కు ఆధారంగా నిలుస్తుంది’’ అని ఓ వెబినార్‌లో ద్రవిడ్‌ చెప్పాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.