close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కూనే.. కొట్టేసింది

ఇంగ్లాండ్‌కు షాక్‌
స్టిర్లింగ్‌, బాల్బిర్నీ శతకాలు

 329 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఐర్లాండ్‌

సౌథాంప్టన్‌: లక్ష్యం 329.. ఎలాంటి జట్టుకైనా ఇది కష్టసాధ్యమైందే. అది ఐర్లాండ్‌కైతే మహా కష్టం. కానీ ఈ కూన ప్రపంచ ఛాంపియన్‌ ఇంగాడ్‌కు షాకిచ్చింది. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పాల్‌ స్టిర్లింగ్‌ (142; 128 బంతుల్లో 9×4, 6×6), కెప్టెన్‌ ఆండ్రూ బాల్బిర్నీ (113; 112 బంతుల్లో 12×4) శతకాలతో చెలరేగడంతో 49.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. మొదట ఇంగ్లాండ్‌ 49.5 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటైంది. 50 పరుగుల వద్ద ఐర్లాండ్‌ తొలి వికెట్‌ కోల్పోగా స్టిర్లింగ్‌, బాల్బిర్నీ రెండో వికెట్‌కు 214 పరుగులు జోడించి జట్టును విజయపథంలో నడిపించారు. వీళ్లిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔట్‌ కాగా.. ఐర్లాండ్‌ విజయానికి 33 బంతుల్లో 50 పరుగులు అవసరమయ్యాయి.టెక్టర్‌ (29 నాటౌట్‌), కెవిన్‌ ఓబ్రైన్‌ (21 నాటౌట్‌) మిగతా పని పూర్తి చేశారు. ఆఖరి ఓవర్లో 8 పరుగులు అవసరం కాగా ఐదు బంతుల్లోనే సాధించేశారు. వన్డేల్లో ఇంగ్లాండ్‌పై ఐర్లాండ్‌కు ఇది రెండో విజయం. 2011 ప్రపంచకప్‌లో బెంగళూరులో ఇంగ్లాండ్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని (328) 5 బంతులుండగానే ఐర్లాండ్‌ ఛేదించింది. ఆ మ్యాచ్‌లోనూ ఐర్లాండ్‌ 329 పరుగులు చేయడం విశేషం. ఇక 2-1తో సిరీస్‌ ఇంగ్లాండ్‌ సొంతమైనా.. ఆఖరి మ్యాచ్‌లో గెలుపుతో 10 పాయింట్లు సాధించిన ఐర్లాండ్‌ వన్డే ప్రపంచకప్‌ సూపర్‌ లీగ్‌ పట్టికలో ఖాతా తెరిచింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.