close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఒక అభిమాని.. 5 వేల సంతకాలు

స్టార్‌ క్రికెటర్లు కనబడగానే అభిమానులు ఆటోగ్రాఫ్‌ల కోసం, సెల్ఫీల కోసం   ఎగబడడం మామూలే! కొంతమందైతే ఎన్ని కష్టాలు పడైనా ఒక సంతకమో.. లేదా ఫొటో తీసుకుని మురిసిపోతారు.. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5000 మంది క్రికెటర్ల ఆటోగ్రాఫ్‌లు సేకరించడం అంటే మామూలు విషయమా! కానీ ఒడిషాకు చెందిన వీరాభిమాని సరోజ్‌ రంజన్‌కర్‌ ఇదే చేశాడు! చిన్నప్పటి నుంచి   క్రికెటర్‌ కావాలని కలగన్న అతను ఆ లక్ష్యాన్ని అందుకోలేకపోయినా.. స్టేడియాలకు వెళ్లి మ్యాచ్‌లు వీక్షిస్తూ క్రికెటర్ల నుంచి సంతకాలు సేకరించడం మొదలుపెట్టాడు. ఎంతో శ్రమతో సచిన్‌ తెందుల్కర్‌, క్లైవ్‌ లాయిడ్‌, డాన్‌ బ్రాడ్‌మన్‌, బ్రయాన్‌ లారా, గ్యారీ సోబర్స్‌, వివ్‌ రిచర్డ్స్‌ లాంటి హేమాహేమీలు సహా మొత్తం అయిదు వేల మంది క్రికెటర్ల సంతకాలు సేకరించాడు. వీటితో పాటు ఫొటోలు, గ్లవ్స్‌, బ్యాట్‌లు, బంతులు కూడా బహుమతిగా అందుకున్నాడు. రంజన్‌ ఆటోగ్రాఫ్‌లు సేకరించడంలో క్రికెటరైన అతని కుమారుడు యువరాజ్‌ కర్‌ కూడా సాయం చేస్తున్నాడు. 1982లో క్లైవ్‌ లాయిడ్‌    సంతకంతో ప్రయాణం మొదలైనట్లు, త్వరలోనే ఒక మ్యూజియం ఏర్పాటు చేసి  ఈ జ్ఞాపకాలను పదిలపరచనున్నట్లు రంజన్‌ చెప్పాడు.  

  - ఈటీవీ భారత్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.