IPL 2021: సన్‌రైజర్స్‌ ఔట్‌
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 26/09/2021 07:11 IST

IPL 2021: సన్‌రైజర్స్‌ ఔట్‌

ఎనిమిదో ఓటమితో ప్లేఆఫ్‌ రేసుకు హైదరాబాద్‌ దూరం
విజృంభించిన బిష్ణోయ్‌.. గట్టెక్కిన పంజాబ్‌

షార్జా పరుగులవరద పారే మైదానం. అలాంటి మైదానంలో హిట్టర్లకు పేరుపడ్డ పంజాబ్‌ బ్యాటింగ్‌ ఎంచుకోగానే పరుగుల పండుగే అనుకున్నారంతా. ఫోర్లు, సిక్సర్ల వర్షం చూడబోతున్నామనుకుంటే.. సింగిల్స్‌ తీయడం కూడా కష్టమైపోయిందక్కడ. పంజాబ్‌ అతి కష్టం మీద 125 పరుగులు చేస్తే.. ఆ లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిలపడింది సన్‌రైజర్స్‌. బంతితో, బ్యాటుతో హోల్డర్‌ ఎంతో శ్రమించినా హైదరాబాద్‌ను గెలిపించలేకపోయాడు. ఆ జట్టు ప్లేఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

షార్జా

పీఎల్‌-14లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కథ ముగిసింది. ప్లేఆఫ్‌ అవకాశాలు అడుగంటినప్పటికీ, సాంకేతికంగా  రేసులోనే నిలిచిన ఆ జట్టు.. ఇప్పుడు ఆ రకంగానూ పోటీలో లేకుండా పోయింది. ఎనిమిదో ఓటమితో ప్లేఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 5 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మొదట హోల్డర్‌ (3/19) ధాటికి పంజాబ్‌ 7 వికెట్ల నష్టానికి 125 పరుగులే చేసింది. మార్‌క్రమ్‌ (27) టాప్‌స్కోరర్‌. అనంతరం సన్‌రైజర్స్‌ 7 వికెట్లకు 120 పరుగులే చేసింది. హోల్డర్‌ (47 నాటౌట్‌; 29 బంతుల్లో 5×6) బ్యాటుతోనూ రాణించి జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. సాహా (31) సైతం పోరాడాడు. కానీ రవి బిష్ణోయ్‌ (3/24), షమి (2/14) విజృంభించడంతో సన్‌రైజర్స్‌కు ఓటమి తప్పలేదు. షమి ఆరంభంలోనే కీలకమైన వార్నర్‌ (2), విలియమ్సన్‌ (1)ల వికెట్లు పడగొట్టి ఆరంభంలోనే సన్‌రైజర్స్‌ను ఆత్మరక్షణలోకి నెట్టాడు. పవర్‌ ప్లేలో సన్‌రైజర్స్‌ చేసిన పరుగులు 20 మాత్రమే. 13 ఓవర్లకు స్కోరు 60/5. రవి మిడిలార్డర్‌ పని పట్టాడు. అయితే ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హోల్డర్‌ అనూహ్యంగా చెలరేగాడు. 5 బంతుల వ్యవధిలో 3 సిక్సర్లు బాది హైదరాబాద్‌ను పోటీలోకి తెచ్చాడు. సాహా  రనౌటైపోయినా.. హోల్డర్‌ పోరాటం కొనసాగింది. అయితే 2 ఓవర్లలో 21 పరుగులు చేయాల్సిన స్థితిలో.. 19వ ఓవర్లో అర్ష్‌దీప్‌.. రషీద్‌ (3) వికెట్‌ తీసి 4 పరుగులే ఇవ్వడంతో మ్యాచ్‌ పంజాబ్‌ వైపు మొగ్గింది. చివరి ఓవర్లో రెండో బంతికి హోల్డర్‌ సిక్సర్‌ బాదినా.. ఆఖరు నాలుగు బంతుల్లో ఎలిస్‌ 4 పరుగులే ఇచ్చి కింగ్స్‌ను గెలిపించాడు. 10 మ్యాచ్‌ల్లో పంజాబ్‌కిది నాలుగో గెలుపు. హోల్డర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

పంజాబ్‌ కష్టంగా..: అంతకుముందు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ పరుగుల కోసం చాలా కష్టపడింది. రాహుల్‌ (21 బంతుల్లో 21), మయాంక్‌ (6 బంతుల్లో 5), గేల్‌ (17 బంతుల్లో 14), మార్‌క్రమ్‌ (32 బంతుల్లో 27).. చాలా దూకుడుగా బ్యాటింగ్‌ చేసే వీళ్లలో ఒక్కరూ 100 స్ట్రైక్‌ రేట్‌ దాటలేకపోయారు.హోల్డర్‌ ఒకే ఓవర్లో ఓపెనర్లిద్దరినీ ఔట్‌ చేసి పంజాబ్‌ను గట్టి దెబ్బ తీశాడు. మార్‌క్రమ్‌ పోరాటంతో పంజాబ్‌ 100కు చేరువైంది. తర్వాత దీపక్‌ హుడా (13), హర్‌ప్రీత్‌ బ్రార్‌ (18), ఎలిస్‌ (12) తలా కొన్ని పరుగులు చేసి పోరాడగలిగే లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించారు.

పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: కేఎల్‌ రాహుల్‌ (బి) సుచిత్‌ (బి) హోల్డర్‌ 21; మయాంక్‌ అగర్వాల్‌ (సి) విలియమ్సన్‌ (బి) హోల్డర్‌ 5; గేల్‌ ఎల్బీ (బి) రషీద్‌ ఖాన్‌ 14; మార్‌క్రమ్‌ (సి) పాండే (బి) సమద్‌ 27; పూరన్‌ (సి) అండ్‌ (బి) సందీప్‌ 8; దీపక్‌ హుడా (సి) సుచిత్‌ (బి) హోల్డర్‌ 13; హర్‌ప్రీత్‌ బ్రార్‌ నాటౌట్‌ 18; ఎలిస్‌ (సి) పాండే (బి) భువనేశ్వర్‌ 12; షమి నాటౌట్‌ 0; ఎక్స్‌టాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 125;

వికెట్ల పతనం: 1-26, 2-27, 3-57, 4-66, 5-88, 6-96, 7-118;

బౌలింగ్‌: సందీప్‌ శర్మ 4-0-20-1; భువనేశ్వర్‌ 4-0-34-1; హోల్డర్‌ 4-0-19-3; ఖలీల్‌ అహ్మద్‌ 3-0-22-0; రషీద్‌ ఖాన్‌ 4-0-17-1; అబ్దుల్‌ సమద్‌ 1-0-9-1

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) రాహుల్‌ (బి) షమి 2; సాహా రనౌట్‌ 31; విలియ్సన్‌ (బి) షమి 1; మనీష్‌ పాండే (బి) బిష్ణోయ్‌ 13; కేదార్‌ జాదవ్‌ (బి) రవి బిష్ణోయ్‌ 12; సమద్‌ (సి) గేల్‌ (బి) బిష్ణోయ్‌ 1; హోల్డర్‌ నాటౌట్‌ 47; రషీద్‌ ఖాన్‌ (సి) అండ్‌ (బి) అర్ష్‌దీప్‌ 3; భువనేశ్వర్‌ నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 120;

వికెట్ల పతనం: 1-2, 2-10, 3-32, 4-56, 5-60, 6-92, 7-105;

బౌలింగ్‌: షమి 4-1-14-2; అర్ష్‌దీప్‌ 4-0-22-1; ఎలిస్‌ 4-0-32-0; హర్‌ప్రీత్‌ బ్రార్‌ 4-0-25-0; రవి బిష్ణోయ్‌ 4-0-24-3



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన