తండ్రి వ్యాఖ్యలను వ్యతిరేకించిన యువీ
close

ప్రధానాంశాలు

Updated : 12/12/2020 12:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తండ్రి వ్యాఖ్యలను వ్యతిరేకించిన యువీ

పుట్టిన రోజు వేడుకలకు దూరం..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఛాంపియన్‌ యువరాజ్‌సింగ్‌ శనివారం 39వ జన్మదినం జరుపుకొంటున్నాడు. అయితే, ఈసారి వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపాడు. తాజాగా ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టిన అతడు రైతుల ఆందోళనలపై స్పందిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాడు. తమ కోరికలు నెరవేరడానికి పుట్టిన రోజులు అవకాశాల లాంటివని, కానీ ఈసారి తాను వేడుకలు జరుపుకోవడం లేదని స్పష్టం చేశాడు. అందుకు బదులు.. కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య చర్చలు ఫలప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నాడు. దేశానికి రైతులే జీవనాధారం అని, అయితే శాంతియుతంగా చర్చిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని యువీ రాసుకొచ్చాడు. 

అలాగే రైతుల ఆందోళన పట్ల తన తండ్రి చేసిన వ్యాఖ్యలపై యువీ స్పందించాడు. సోమవారం అతడి తండ్రి యోగ్‌రాజ్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులను అర్థం చేసుకోవాలని, వారి పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరాడు. అలాగే ఈ ఉద్యమానికి సంఘీభావంగా పలువురు క్రీడాకారులు తమకు ప్రభుత్వం బహూకరించిన  క్రీడా పతకాలను తిరిగిచ్చేయడం సరైందేనని, అందుకు మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు. దీనిపై యువీ స్పందించాడు. ఒక భారతీయుడిగా తన తండ్రి చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పాడు. అవి ఆయన‌ వ్యక్తిగత అభిప్రాయాలని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు.

ఇవీ చదవండి..

భవిష్యత్‌లో అతడే కీలకం: సెహ్వాగ్‌ 

ఇప్పుడైనా  ఆస్ట్రేలియాపై చెలరేగుతాడా?  Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన