close

ప్రధానాంశాలు

Published : 22/09/2020 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫ్రెంచ్‌ ఓపెన్‌ వదిలేసి గోల్ఫ్‌లో..

సిడ్నీ: మహిళల టెన్నిస్‌ నంబర్‌వన్‌ ఆష్లే బార్టీకి క్రికెట్లోనూ ప్రవేశం ఉందన్న సంగతి తెలిసిందే. తన బహుళ ప్రావీణ్యతను మరోసారి చాటుకుంటూ ఆమె గోల్ఫ్‌లోనూ మెరిసింది. గత ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఛాంపియన్‌గా నిలిచిన ఆమె.. కరోనా కారణంగా ఆ టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. ఆ టోర్నీ మొదలవుతున్న సమయంలో ఈ ఆస్ట్రేలియా అమ్మాయి.. బ్రూక్‌ వాటర్‌ గోల్ఫ్‌ క్లబ్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ‘విజేతలు’ అని శీర్షిక పెడుతూ తాను, పురుషుల ఛాంపియన్‌ లూయిస్‌ కలిసి ఉన్న ఓ ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. గతంలో క్రికెట్లోనూ సత్తా చాటిన ఆమె.. 2015-16లో మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో బ్రిస్బేన్‌ హీట్‌ జట్టుకు ఆడింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.