close

ప్రధానాంశాలు

Published : 22/09/2020 02:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చెన్నైకి ఎదురుందా?

రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌

షార్జా: ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌కు షాకిచ్చిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరో గెలుపుపై కన్నేసింది. కీలక ఆటగాళ్లు స్టోక్స్‌, బట్లర్‌ లేని రాజస్థాన్‌ రాయల్స్‌తో మంగళవారం తలపడనుంది. ఎప్పటిలాగే ఈ మ్యాచ్‌లోనూ సీఎస్కేనే ఫేవరేట్‌ అనడంలో సందేహం లేదు.  ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌కు ముందు రాజస్థాన్‌ రాయల్స్‌ గందరగోళ స్థితిలో ఉంది. ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ తండ్రికి అనారోగ్యం కారణంగా న్యూజిలాండ్‌లో ఉండిపోయాడు. అతను ఈ సీజన్‌ ఆడే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ బట్లర్‌ చెన్నైతో మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ఇంగ్లాండ్‌ నుంచి కుటుంబంతో కలిసి అతను ఆలస్యంగా యూఏఈ చేరుకోవడంతో 36 గంటల క్వారంటైన్‌ పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఈ ప్రతికూలతల మధ్య.. కెప్టెన్‌ స్మిత్‌ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం ఓ గొప్ప సానుకూలత. ఇంగ్లాండ్‌లో పర్యటన సందర్భంగా నెట్‌ ప్రాక్టీస్‌లో కంకషన్‌కు గురై.. వన్డే సిరీస్‌కు దూరమైన అతను దాని నుంచి పూర్తిగా కోలుకున్నాడు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.