close

ప్రధానాంశాలు

Published : 22/11/2020 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అప్పటికి సిద్ధంగా ఉంటా

ఐపీఎల్‌ సందర్భంగా రోహిత్‌ శర్మ గాయంపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఫిట్‌గా లేడంటూ సెలక్టర్లు రోహిత్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోగా.. అతడు మాత్రం ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడేశాడు. ఆ తర్వాత టెస్టు సిరీస్‌కు ఎంపికైనా రోహిత్‌ గాయంపై స్పష్టతైతే లేదు. అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా ఇంటర్వ్యూలో తన గాయంపై పెదవి విప్పిన రోహిత్‌.. ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం చేశాడు. అతడు ఏమన్నాడంటే..


గాయంతో ఎందుకాడానంటే..

నిజాయతీగా చెప్పాలంటే నా గురించి అంత చర్చ జరిగిన విషయం నాకు తెలియదు. ఒక్కటి మాత్రం నిజం. నా గాయానికి సంబంధించి ఎప్పటికప్పుడు బీసీసీఐ, ముంబయి ఇండియన్స్‌తో మాట్లాడుతూనే ఉన్నా. టీ20 మ్యాచే కాబట్టి మైదానంలోకి దిగగలనని (గాయంతో), పెద్దగా ఇబ్బంది లేకుండా మ్యాచ్‌ ఆడగలనని ముంబయి ఫ్రాంఛైజీతో చెప్పా. నాకు స్పష్టత వచ్చాక నా దృష్టంతా నేను చేయాల్సిన పని పైనే పెట్టా. ప్రస్తుతం తొడకండరం బాగానే ఉంది. ఇంకా బలంగా తయారయ్యే ప్రక్రియ మొదలు పెట్టా. టెస్టు సిరీస్‌కు ఆడడానికి ముందు.. పూర్తిగా కోలుకోవడానికి నేను చిన్న అవకాశం కూడా వదిలి పెట్టలేదన్న భావన నాలో కలగాలి. అందుకే ఎన్‌సీఏకు వచ్చా.


అది నాకు అనవసరం

నా గురించి ఎవరేమనుకుంటున్నారు, ఆస్ట్రేలియాకు నేను వెళ్తానా లేదా అన్నదాని గురించి ఎవరేం మాట్లాడినా నాకు అనవసరం. ఆ చర్చలను నేను పట్టించుకోను. గాయపడ్డాక రెండు రోజుల పాటు.. తర్వాతి 10 రోజులు ఏం చేయాలి, అసలు నేను ఆడగలుగుతానా లేదా అన్న దాని గురించి ఆలోచించా. కానీ ప్రతి రోజు తొడకండరాల గాయం తీవ్రత మారుతూ వచ్చింది. మారుతున్న తీరుతో ఆడగలనన్న విశ్వాసం పెరిగింది. అప్పుడు ముంబయి ఇండియన్స్‌తో అదే విషయం గురించి మాట్లాడా. ప్లేఆఫ్స్‌ ముందు నుంచి ఆడగలనని చెప్పా. ఏమాత్రం అసౌకర్యంగా అనిపించినా ప్లేఆఫ్స్‌ ఆడనని చెప్పా. అయితే పూర్తిగా కోలుకోవడానికి ఇప్పటికీ ఇంకాస్త శ్రమించాల్సివుంది. అందుకే పరిమిత ఓవర్ల క్రికెట్‌ కోసం నేను ఆస్ట్రేలియా వెళ్లలేదు. ఆ మ్యాచ్‌లు వరుసగా ఉన్నాయి. 11 రోజుల్లో 6 మ్యాచ్‌లు ఆడాల్సివుంటుంది. ఈ నేపథ్యంలో ఈ 25 రోజులు నా ఫిట్‌నెస్‌పై దృష్టిపెడితే టెస్టు మ్యాచ్‌లు ఆడొచ్చని భావించా. టెస్టులు ఆడాలన్నది నాకు తేలికైన నిర్ణయం. ఇతరులకు ఎందుకంత సంక్లిష్టంగా అనిపిస్తుందో అర్థం కావట్లేదు.


అతడి సమయం వస్తుంది

పీఎల్‌ సందర్భంగా జట్టు గదిలో కూర్చున్నప్పుడు నిరాశలో కూరుకుపోయిన సూర్యకుమార్‌ యాదవ్‌ (భారత జట్టుకు ఎంపిక కానందుకు)ను చూశా. కానీ నేను వెళ్లి అతడితో మాట్లాడలేదు. అతడే నా దగ్గరకు వచ్చి ‘‘నువ్వేమీ బాధపడొద్దు. నేను ఆ బాధ నుంచి బయటపడి ముంబయి విజయాల కోసం ఆడతా’’ అన్నాడు. సూర్యకుమార్‌ ఆ మాటలు అన్నప్పుడు.. ఐపీఎల్‌ పరంగానే కాకుండా మొత్తం కెరీర్‌కు సంబంధించి అతడు సరైన మార్గంలో పయనిస్తున్నాడనిపించింది. భారత్‌ ఎన్నో మ్యాచ్‌లు ఆడనుంది. అతడి సమయం వస్తుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.