
ప్రధానాంశాలు
మార్పులు పని చేశాయ్!
మూడో వన్డేలో కోహ్లి చేసిన నాలుగు మార్పులు భారత జట్టుకు కలిసొచ్చాయి. ఓపెనర్ మయాంక్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన శుభ్‌మన్ గిల్.. ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తూ క్రీజులో ఉన్నంతసేపు ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. షార్ట్ పిచ్ బంతిని అతనాడిన పుల్ షాట్ సిక్సర్ ముచ్చటగొలిపింది. గిల్ 33 పరుగులు చేసి ఔటయ్యాడు. మహ్మద్ షమి, యుజ్వేంద్ర చాహల్, నవ్‌దీప్ సైని స్థానాల్లో దిగిన శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, నటరాజన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. షమి ఈ మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకోగా.. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలమైన సైని, చాహల్‌లపై వేటు పడింది. ఈ ముగ్గురి స్థానంలో వచ్చిన శార్దూల్, కుల్దీప్, నటరాజన్ చక్కటి ప్రదర్శన చేశారు. శార్దూల్.. ప్రమాదకర స్మిత్‌తో పాటు, హెన్రిక్స్, అబాట్‌ల వికెట్లు పడగొట్టాడు. లైన్‌కు కట్టుబడి తక్కువ వేగంతోనే తెలివిగా బౌలింగ్ చేశాడు శార్దూల్. ఇక ఐపీఎల్లో అదరగొట్టిన లెఫ్టార్మ్ పేసర్ నటరాజన్ అరంగేట్ర వన్డేలోనే ఆకట్టుకున్నాడు. ఓ తెలివైన బంతితో ఓపెనర్ లబుషేన్‌ను పెవిలియన్ పంపి.. ఆసీస్‌ను తొలి దెబ్బ కొట్టింది అతడే. అంతేకాదు ఆఖర్లో ప్రమాదకరంగా మారుతున్న అగర్ వికెట్‌ను కూడా తీశాడు. మిడిల్ ఓవర్లలో ఆస్ట్రేలియా వేగంగా పరుగులు చేయలేకపోయిందంటే కారణం కుల్దీపే. అతడి ప్రదర్శన మెచ్చిన గావస్కర్.. టీ20ల్లోనూ తననాడించాలని సూచించాడు.
ప్రధానాంశాలు
సినిమా
- పంజాబ్, హరియాణాల్లో హై అలర్ట్
- నేను శివుణ్ని.. నాకు కరోనా పరీక్షలేంటి?
- బాధ్యతల నుంచి తప్పుకున్న చిత్తూరు కలెక్టర్
- మూఢత్వమే ప్రాణాలు తీసింది!
- తెల్ల బియ్యమా? దంపుడు బియ్యమా?
- అందుకు పశ్చాత్తాప పడుతున్నా
- అమ్మకానికి 60 లక్షల మంది భారతీయుల నెంబర్లు
- మాక్సీకి రూ.10 కోట్లు చెల్లిస్తే తెలివిలేనట్లే!
- ప్లాన్లేమీ లేవ్..బయటికొచ్చి బాదడమే: శార్దూల్
- దాదా కాల్ చేశాడు..క్రెడిట్ ద్రవిడ్‌కే: రహానె
ఎక్కువ మంది చదివినవి (Most Read)
