మొతెరాలో మ్యాచ్‌ల మోత
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 11/12/2020 07:57 IST

మొతెరాలో మ్యాచ్‌ల మోత

కొత్త ఏడాదిలో క్రికెట్‌ పండుగ
కొత్త స్టేడియంలో గులాబి టెస్టు.. 5 టీ20లూ అక్కడే
భారత్‌లో ఇంగ్లాండ్‌ పర్యటన షెడ్యూల్‌ విడుదల
ముంబయి

రోనా మహమ్మారితో భారత్‌లో ఆగిపోయిన అంతర్జాతీయ క్రికెట్‌ ఇంగ్లాండ్‌ పర్యటనతో మళ్లీ మొదలవనుంది. ఏడాదికి పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరమైన భారత్‌లో 2021 ఫిబ్రవరి 5న ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుతో ఆట ప్రారంభమవుతుంది. టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య 4 టెస్టులు, 5 టీ20లు, 3 వన్డేల సిరీస్‌లతో కూడిన 52 రోజుల పర్యటన షెడ్యూల్‌ను గురువారం బీసీసీఐ, ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ప్రకటించాయి. కరోనా నేపథ్యంలో మ్యాచ్‌లను మూడు వేదికలకే (చెన్నై, అహ్మదాబాద్‌, పుణె) పరిమితం చేశారు. జరుగుతాయి. అహ్మదాబాద్‌లో రూపుదిద్దుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మైదానం సర్దార్‌ పటేల్‌ మొతెరా స్టేడియంలో మ్యాచ్‌ల మోత మోగనుంది. 1,10,000 సామర్థ్యమున్న మొతెరా స్టేడియం 7 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు జరిగే డేనైట్‌ టెస్టు (మూడో మ్యాచ్‌)తో మొతెరా స్టేడియం గులాబి మయం కానుంది. నాలుగో టెస్టు కూడా అక్కడే జరుగుతుంది. అనంతరం జరిగే అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ మొత్తానికి మొతెరా వేదికగా నిలువనుంది. బీసీసీఐ కార్యదర్శి జై షా సొంతగడ్డ కావడంతో మొతెరాకు ఎక్కువ ప్రాధాన్యం దక్కినట్లుగా తెలుస్తోంది. శ్రీలంక పర్యటన ముగించుకుని జనవరి 27న ఇంగ్లాండ్‌ జట్టు చెన్నైలో అడుగుపెడుతుంది. ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు తొలి టెస్టు, 13 నుంచి 17 వరకు రెండో టెస్టు చెన్నైలోనే జరుగుతాయి. అహ్మదాబాద్‌తో పాటు మొహాలీలో టెస్టు సిరీస్‌ను నిర్వహించాలని మొదట భావించారు. అయితే శ్రీలంక నుంచి చెన్నైకి గంటసేపు ప్రయాణమే కావడం.. భారత బౌలింగ్‌ దాడికి చెపాక్‌ స్టేడియం నప్పుతుందని భావించడంతో మొహాలీని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మార్చి 23, 26, 28 తేదీల్లో జరిగే మూడు వన్డేలకు పుణె వేదికగా నిలువనుంది. శ్రీలంకలోని బయో బబుల్‌ నుంచి చెన్నైలోని బుడగలో అడుగుపెడుతున్న ఇంగ్లాండ్‌ జట్టు వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటుంది. ఆసీస్‌ పర్యటన నుంచి స్వదేశం చేరుకున్న తర్వాత టీమ్‌ఇండియాకు వారం రోజుల పాటు విశ్రాంతి ఇవ్వనున్నారు. అనంతరం ఆటగాళ్లకు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించి బుడగలోకి అనుమతిస్తారు. కరోనా వ్యాప్తికి ముందు భారత్‌లో చివరి సారిగా ఈ ఏడాది జనవరి 19న బెంగళూరులో టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య మూడో వన్డే జరిగింది. భారత్‌లో ఇంగ్లాండ్‌ పర్యటన ఖరారైన నేపథ్యంలో ఐపీఎల్‌ 14వ సీజన్‌కు స్వదేశంలోనే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా.. అవాంతరాలు తలెత్తకుండా ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను విజయవంతం చేస్తే సొంతగడ్డపై 2021 ఐపీఎల్‌ నిర్వహణకు మార్గం సుగమం అవుతుంది.

ఇవీ చదవండి..

గులాబి సన్నాహకం

ఐపీఎల్‌ ఆర్జనలో ధోనీనే నం.1Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన