ఆ అయిదు రోజులూ అదే పాట..
close

ప్రధానాంశాలు

Updated : 12/12/2020 06:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ అయిదు రోజులూ అదే పాట..

ముంబయి: 2004లో ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టు సందర్భంగా అయిదు రోజుల పాటు బ్రయాన్‌ ఆడమ్స్‌ ‘సమ్మర్‌ ఆఫ్‌ 69’ పాట విన్నట్లు దిగ్గజ ఆటగాడు సచిన్‌ తెందుల్కర్‌ తెలిపాడు. సిడ్నీ టెస్టుకు ముందు బ్రిస్బేన్‌, అడిలైడ్‌, మెల్‌బోర్న్‌ మ్యాచ్‌ల్లో సచిన్‌ వరుసగా 0, 1, 37, 0, 44  ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2004 జనవరిలో జరిగిన సిడ్నీ టెస్టులో సచిన్‌ అజేయంగా 241 పరుగులు సాధించాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఇది ఒకటిగా నిలిచింది. సచిన్‌ ఇన్నింగ్స్‌తో టీమ్‌ఇండియా 1-1తో సిరీస్‌ను డ్రా చేసుకోగలిగింది. ‘‘2004 సిడ్నీలో టెస్టులో 241 (నాటౌట్‌) ఇన్నింగ్స్‌ ఆడాను. ఐదు రోజుల పాటు ‘సమ్మర్‌ ఆఫ్‌ 69’ పాట విన్నా. మైదానానికి వెళ్తున్నప్పుడు.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్నంతసేపు.. బ్యాటింగ్‌కు వెళ్లేంత వరకు.. భోజనం, టీ విరామాల్లో.. మ్యాచ్‌ అనంతరం.. హోటల్‌కు వెళ్తునప్పుడు అదే పాట విన్నా. ఐదు రోజుల పాటు ఆ పాట మినహా మరొకటి వినలేదు. 2003 దక్షిణాఫ్రికాలో ప్రపంచకప్‌ సమయంలో లక్కీ అలీ ‘సుర్‌’ ఆల్బమ్‌ విన్నా’’ అని సచిన్‌ తెలిపాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన